ఆడపడుచులతో కలిసి బతుకమ్మ ఆడిన సర్పంచ్ గుంటిపల్లి రేణుక వెంకట్

ధర్మసాగర్‌, అక్టోబర్ 10 (E69NEWS):
ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను గ్రామ ఆడపడుచులు ఘనంగా నిర్వహించారు. ప్రకృతిని ప్రేమిస్తూ, సహజ పూలను పూజించే తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గ్రామంలో పండుగ సందడి నెలకొనగా, మహిళలు సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు.గ్రామ సర్పంచ్ గుంటిపల్లి రేణుక వెంకట్ ఆడపడుచులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొని, వారికి ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.బతుకమ్మ పండుగ కేవలం పూల వేడుక మాత్రమే కాకుండా ప్రకృతిపై ప్రేమకు, మహిళల ఐక్యతకు, ఆత్మీయ అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సహజ పూలను పూజించడం ద్వారా ప్రకృతి పరిరక్షణ ప్రాధాన్యతను చాటిచెప్పే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ సంప్రదాయాలను గౌరవిస్తూ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సర్పంచ్ కోరారు. కార్యక్రమంలో మహిళలు,యువతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *