ప్రారంభించిన ఎస్ఐ వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ
స్టేషన్ ఘనపూర్, ఈ69న్యూస్ అక్టోబర్ 12

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని స్టేషన్ రోడ్డులో రాయల్ సెలూన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన గోల్డెన్ బేకరీని ఎస్ఐ వినయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు బేకరీ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రజలకు అవసరమైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ కొలిపాక సతీష్, 18వ వార్డు కౌన్సిలర్ బొల్లు లక్ష్మి, 12వ వార్డు నాయకుడు పొన్న రవి, 14వ వార్డు నాయకులు పెసరు సారయ్య, గట్టు రమేష్ గౌడ్, గట్టు రంజిత్ గౌడ్, అబ్దుల్ రావుఫ్, అజిముద్దీన్, బషీర్, షమీ, ఇర్ఫాన్, ఆయాజ్, యూనిస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.