సర్పంచ్ అన్నం స్వప్న-గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ బ్రహ్మా రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం

ఈ69 న్యూస్ జఫర్ఘడ్ అక్టోబర్ 12

దసరా పండుగను పురస్కరించుకొని జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలం తమ్మడపల్లి(జి) గ్రామంలో గ్రామ సర్పంచ్ అన్నం స్వప్న -గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ అన్నం బ్రహ్మా రెడ్డి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలనలో భాగస్వాములుగా ఉంటూ గ్రామ అభివృద్ధికి తమ వంతు సేవలందిస్తున్న సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కమిటీ సభ్యులను గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది 7 మంది, వార్డు మెంబర్లు 10 మంది, పంచాయతీ కమిటీ సభ్యులు 9 మందితో పాటు ఇతరులకు కలిపి మొత్తం 35 మందికి బట్టలు పంపిణీ చేశారు. దసరా పండుగ వేళ బట్టలు అందించడం ద్వారా వారిలో పండుగ సంతోషాన్ని నింపారు.గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్లు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ గ్రామ అభివృద్ధికి కృషి చేయడం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.పండుగలు పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందించడంతో పాటు అందరినీ ఐక్యంగా ఉంచుతాయని, గ్రామంలో సోదరభావం, ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు.దసరా పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులకు బట్టలు పంపిణీ చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *