- శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు
- కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్న ర్యాలీ చిన్నయ్య చౌదరి దంపతులు
తెలుగు గళం మంగపేట, అక్టోబర్ 15:
ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం ప్రసిద్ధ బంగారు మైసమ్మ తల్లి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఐదవ రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన ర్యాలీ చిన్నయ్య చౌదరి, భవాని దంపతులు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని బంగారు మైసమ్మ తల్లిని, దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది.
