కలెక్టర్ రాహుల్ శర్మకలెక్టర్ రాహుల్ శర్మ

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లిగోరి
జిల్లాలో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేసి,నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.గురువారం కొత్తపల్లిగోరి మండలం చెన్నాపూర్ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా మాగాణి,మెట్ట భూముల గుర్తింపు,గ్రామ,చెరువుల సరిహద్దుల నమోదు తదితర అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.పనులను వేగవంతం చేసేందుకు ప్రతి మండలంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని,రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని స్పష్టం చేశారు.సిబ్బంది ఎదుర్కొంటున్న ఐడీ,లాగిన్ వంటి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.క్షేత్ర పర్యటనలో భాగంగా కలెక్టర్ స్థానిక రైతు కల్పనతో మాట్లాడి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు.రీ-సర్వే అత్యంత పారదర్శకంగా,లోపాలు లేని విధంగా జరగాలని,ప్రక్రియను ఆర్డీవో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరికృష్ణ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి,తహసీల్దార్ హేమ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *