- లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన రెవెన్యూ అధికారులు
- రేషన్ సేవల్లో ఆధునికతకు శ్రీకారం..
తెలుగు గళం మంగపేట, అక్టోబర్ 28:
మంగపేట మండలం రమణక్కపేట గ్రామపంచాయతీలో బుధవారం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పరిపాలన అధికారి కన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసుపాదం పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు రేషన్ కార్డుల ప్రాధాన్యత, వాటి ద్వారా అందే ప్రజా పంపిణీ వ్యవస్థ సేవల గురించి వివరించారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ రావుల లలిత, పంచాయతీ సిబ్బంది గాజు నరసింహ రావు, పలువురు లబ్ధిదారులు పాల్గొన్నారు.
