గతంలోనూ వన్యప్రాణుల దాడులతో ప్రమాదాలు.. అటవీశాఖ వెంటనే స్పందించాలి
ఎలుగుబంటిని పట్టుకుని అడవిలోకి తరలించాలని స్థానికుల విజ్ఞప్తి
తెలుగు గళం ఈ69 న్యూస్ జఫర్గఢ్ అక్టోబర్ 28

జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలోని రామాలయం సమీపంలో ఎలుగుబంటి సంచరిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో పలుమార్లు ఎలుగుబంట్లు సంచరించాయని, వాటి దాడుల్లో పలు జంతువులతో పాటు మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు.తాజాగా మరోసారి ఎలుగుబంటి సంచారం కనిపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో బయటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి ఎలుగుబంటి ఆచూకీ గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టి, ఎలుగుబంటిని సురక్షితంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి, ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.