ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉదారతఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉదారత

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉదారత

తెలుగు గళం న్యూస్ వర్దన్నపేట /అక్టోబర్ 29
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన పాలకుర్తి భారతమ్మ భర్త వీరాస్వామి అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోశాల వెంకన్న గౌడ్,వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య ఇల్లంద గ్రామంలో బాధితురాలి కోడలు పాలకుర్తి దివ్యకు చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గతంలో దళిత ఎమ్మెల్యేలుగా పనిచేసిన పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎల్ఓసీలను అరుదుగా ఇచ్చేవారని, ఇచ్చినా రూ. 50 వేలు, లక్షతో సరిపెట్టేవారని, అది కూడా కుటుంబ సభ్యులు కాళ్లు అరిగేలా తిరిగితేనే వచ్చేదని అన్నారు. సకాలంలో ఎల్ఓసీ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారన్నారు.ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాత్రం పార్టీలకు అతీతంగా,ఎవరి విషయం దృష్టికి వచ్చినా మరుక్షణమే స్పందించి,రోగి ఆసుపత్రిలో చేరిన ఒకటి, రెండు రోజుల్లోనే రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఎల్ఓసీలు ఇప్పించి ప్రాణాలు కాపాడుతున్నారని కొనియాడారు.కేఆర్ అంటేనే కమిట్మెంట్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లంద గ్రామ కమిటీ అధ్యక్షులు ఎద్దు రాజేంద్ర ప్రసాద్,ఎస్సీ సెల్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య, రాజరాజేశ్వర దేవస్థానం చైర్మన్ మైదం బుచ్చిమల్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గడ్డం సమ్మయ్య గౌడ్,కాంగ్రెస్ నాయకులు దుప్పెల్లి ఏలీయా,బాషబోయిన ప్రవీణ్,బూరుగు రమేష్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *