శేరిలింగంపల్లి, అక్టోబర్ 30 ( తెలుగు గళం ) న్యూస్:
నేతాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలపై జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించిన కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్. నేతాజీ నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుండి మురుగునీరు ఇండ్లలోకి వస్తుందని కాలనీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని జలమండలి అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయం సూపర్వైజర్ సురేష్ కి సమాచారం ఇవ్వగా ఆయన సిబ్బందిని పంపించి కాలనీలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యని దగ్గరుండి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్, అసోసియేషన్ సభ్యులు కాలనీ సభ్యులు శంకర్ నాయక్, దశరథ్ నాయక్, గణేష్ నాయక్, రాంబాబు నాయక్. సమస్యను జలమండలి సిబ్బంది అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీటి సమస్యను పరిష్కరించారు.
