జిట్టబోయిన కొమురెల్లి యాదవ్జిట్టబోయిన కొమురెల్లి యాదవ్

జిట్టబోయిన కొమురెల్లి యాదవ్

తెలుగు గళం న్యూస్ పాలకుర్తి/నవంబర్ 1

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశాల మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో భారత రాష్ట్ర సమితి పార్టీ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ నాయకులు జిట్టబోయిన కొమురెల్లి యాదవ్ గ్రామంలోని పట్టభద్రులను కలిసి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు శాసనమండలి ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. మీ ఓటుతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనిపిలుపునిచ్చారు.ఉద్యోగాల పేరుతో మోసం చేసిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి,ఒక్కో విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా పత్రం,ప్రతి సంవత్సరం లక్ష ఉద్యోగాలు,ప్రతి విద్యార్థినికి విద్యుత్ ద్విచక్ర వాహనం ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.విద్యార్థులకు అండగా ఉండాల్సిన రుసుముల తిరిగి చెల్లింపు డబ్బులు 8,591 కోట్ల రూపాయలు విడుదల కాకపోవడంతో రాష్ట్రంలోని విద్యార్థులు,కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయని అన్నారు.రైతులకు సాగునీరు, 24 గంటలవిద్యుత్తు,రైతుబంధు,రుణమాఫీ,ప్రజలకు సంక్షేమం అందించడంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు ఎంతవరకు జరిగిందో ప్రజలు ప్రశ్నించాలన్నారు.ప్రశ్నించే గొంతుకకు ఓటే బలమని,ప్రభుత్వ పనితీరును అంచనా వేసి ప్రజా సమస్యలపై తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యక్తం చేసే అవకాశం పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలు కల్పిస్తాయన్నారు. పట్టభద్రులందరూ ఓటరు నమోదుపై నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులో తమ పేరును నమోదు చేసుకోవాలని,పార్టీ నాయకులు,కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించి నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు జోగు గోపి, నియోజకవర్గ సామాజిక మాధ్యమాల బాధ్యులు జోగు ఆంజనేయులు,బమ్మెర గ్రామపంచాయతీ నాలుగవ వార్డు సభ్యులు వంగాల గణేష్,భారత రాష్ట్ర సమితి పార్టీ అణగారిన వర్గాల విభాగం అధ్యక్షులు జున్ను సంపత్,బమ్మెర భారత రాష్ట్ర సమితి పార్టీ యువజన నాయకులు తోకల శోభన్,యువజన నాయకులు బత్తిని రాజు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *