వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజువర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

తెలుగు గళం న్యూస్ న్యూఢిల్లీ/నవంబర్ 1

ఢిల్లీలో జరిగిన ఓటు బచావో – దేశ్ బచావో ర్యాలీలో వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు పాల్గొన్నారు.ఏఐసీసీ పిలుపు మేరకు ఓటు బచావో-దేశ్ బచావో ఉద్యమానికి వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం నుండి భారీ ఎత్తున ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివచ్చారు. అనంతరం ర్యాలీగా రాంలీలా మైదాన్ బహిరంగ సభకు చేరుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు,మాట్లాడుతూ…దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి కాంగ్రెస్ శ్రేణులు తరలిరావడంతో బీజేపీ నాయకుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు.రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తక్షణమే గణేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ దేశంలో మన రాజ్యాంగం ఓ భగవద్గీత,ఓ ఖురాన్, ఓ బైబిల్ లాంటిదని,బీజేపీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో పడబోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.వంద సంవత్సరాల నాటి మనువాదాన్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని పక్కనపెట్టేందుకు ఓటు చోరీ కుట్ర చేస్తున్నారని విమర్శించారు.డాక్టర్ అంబేద్కర్ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు ఎంతో ముందుచూపుతో ఓటు హక్కు కల్పిస్తే,ఈ వర్గాలు బీజేపీకి ఓటు బ్యాంకు కాదనే దూర ఆలోచనతో ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.రాహుల్ గాంధీ బీజేపీ చేస్తున్న కుట్రలను గమనించి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చి రాజ్యాంగాన్ని,ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుని,ఓటు చోరీని అడ్డుకోవాలని పిలుపునిస్తే లక్షలాది మందితో ఢిల్లీ దద్దరిల్లిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు వెంట పీఏసీఎస్ చైర్మన్ అబ్బీడి రాజిరెడ్డి, వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్,కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట టౌన్ ప్రెసిడెంట్ ఈగ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *