ఈ69 న్యూస్,శింగనమల.
రాయలసీమ స్థాయి తైక్వాండో పోటీలకు పెనకచెర్ల డ్యామ్‌లోని నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు బెస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఈ విద్యార్థులు రాబోయే పోటీలలో తమ ప్రతిభను చాటనున్నారు.
ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను నిర్మల ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ డాక్టర్ డి. హైదర్ వలి, ప్రిన్సిపాల్ యాస్మిన్ నేహార్, డైరెక్టర్ జిలాన్, బెస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ షేక్ యూనిస్, వై.వి. కన్స్ట్రక్షన్స్ అధినేత షేక్ ఫైజన్ ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నాయక్ ఖలీల్, తాజుద్దీన్ మరియు తైక్వాండో కోచ్ తలారి తులసి రామ్ తదితరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
