సత్తుపల్లి/వేంసూరు,నవంబర్22(తెలుగుగళం) న్యూస్:
వేంసూరు మండలంలో గల మొత్తం 26 గ్రామ పంచాయతీలలో ఇందిరమ్మ భీమా రిజిస్ట్రేషన్ శనివారం రెండో రోజుకు చేరింది.ఐదు గ్రామాలలో ప్రారంభానికి నోచుకోలేదు.ప్రారంభం కానీ గ్రామాలలో మర్లపాడు,బీరాపల్లి,కెజీ మల్లెల,ఎర్రగుంటపాడు గ్రామ పంచాయతీలు అధికార పార్టీ కు చెందినవి అవడం మండలంలో హాట్ టాపిక్ గా నడుస్తుంది.మిగిలిన ఒక పంచాయతీ వెంకటాపురం బి.ఆర్.ఎస్.మద్దతు దారులుగా ఉన్నారు. నిర్వహణ కోసం బడ్జెట్ లేక పోవడం కూడా కారణమంటున్నారు.శనివారం నాటికి 2641 మంది ఇందిరమ్మ భీమా కు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఇంచార్జీ ఎంపీడీఓ భూక్యా రంజిత్ కుమార్ మీడియాకు తెలిపారు.
మర్లపాడు,బీరాపల్లి,కెజీ మల్లెల,ఎర్రగుంటపాడు గ్రామ పంచాయతీలు