ధర్మారం గ్రామ పార్టీ డ్రా ద్వారా ఎన్నిక.ధర్మారం గ్రామ పార్టీ డ్రా ద్వారా ఎన్నిక.

అన్నారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఏకగ్రీవం

ధర్మారం గ్రామ పార్టీ డ్రా ద్వారా ఎన్నిక.

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్ సమక్షంలో గ్రామ కమిటీ ఎన్నిక ..

ముఖ్యఅతిదులు గా మాజీ జడ్పీటీసీ కదిర సురేందర్,కదిర స్రవంతిప్రకాష్ గౌడ్

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి,పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్,స్థానిక శాసనసభ్యులు డా. మురళీనాయక్,డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళీనాయక్ ఆదేశాల మేరకు కేసముద్రం మండల కమిటీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో మండలం లోని అన్నీ గ్రామాల నూతన కమిటీల ఎన్నికల ప్రక్రియలో భాగంగా కేసముద్రం మండలంలోని అన్నారం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,స్థానిక సర్పంచ్ పృథ్వీరాజ్ అధ్యక్షతన,ధర్మారం గ్రామం లో గ్రామపార్టీ అధ్యక్షులు బానోత్ భాస్కర్, స్థానిక సర్పంచ్ భూక్యా ఈశ్వరమ్మ నంద్యా నాయక్ అధ్యక్షతన,మండల పార్టీ అధ్యక్షులు సమ్మిగౌడ్ సమక్షంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు కదిర సురేందర్, ప్రకాష్ గౌడ్ లతో కలిసి నూతన గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు..

రెండు గ్రామల లోని సీనియర్ నాయకులు , ప్రజా ప్రతినిధులు, వార్డ్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకలు అందరూ కలిసికట్టుగా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతలకు కట్టుబడి,ఎలాంటి పోటీలకు, భేషజాలకు వెళ్లకుండా మంచి మనస్సుతో, స్నేహాభావం తో సెంట్రల్ లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి ని,మళ్ళీ రెండవ సారి కాంగ్రెస్ పార్టీ నీ,రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు లో మనమంతా భాగస్వాములు కావాలనే అంకిత భావం తో అందరూ కలిసికట్టుగా ఏకగ్రీవ తీర్మానం చేసి అన్నారం “గ్రామ పార్టీ అధ్యక్షులు గా షేక్ గౌస్ పాషా ను,ప్రధాన కార్యదర్శిగా అంబటి యాదగిరి ,ఉపాధ్యాక్షలుగా యాకన్న,గౌరబోయిన శ్రీనివాస్ ,కోశాధికారిగా దాసరి రామకృష్ణ లను, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..
అలాగే యువజన కాంగ్రెస్ అధ్యక్షులు
గౌరబోయిన ఈశ్వర్, ప్రధానకార్యదర్శి పాటి యశ్వంత్,ఉపాధ్యక్షులు గా వల్లెపు కళ్యాణ్ కోశాధికారి పిల్లలమర్రి ముఖేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు_

ధర్మారం గ్రామ పార్టీ అధ్యక్షులు గా ఇద్దరు గుగులోత్ పర్షా నాయక్, బోడ రమేష్ పోటి పడగా ఇద్దరిపేర్లను డ్రా తీయగా గుగులోత్ పర్శనాయక్ డ్రా లో గెలుపొందారు.. గ్రామ పార్టీ అధ్యక్షులు గా గుగులోత్ పర్షా నాయక్, ఉపాధ్యక్షులు గా బోడ రమేష్ ,ప్రధానకార్యదర్శి గా కున్సోత్ సుమన్ , కోశాధికారిగా నూణావత్ శోభన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గా భూక్యా తరుణ్, ప్రధానకార్యదర్శి కూన్సత్ వెంకన్న,కోశాధికారి గా గుగులోత్ వెంకన్న లను గ్రామ కాంగ్రెస్ పార్టీ కుటుంబసభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు,ఈ సందర్బంగా మండల కమిటీ అధ్యక్షులు సమ్మిగౌడ్ మరియు కదిర సురేందర్ లు మాట్లాడుతూ అధికారం లో పార్టీ లేనప్పుడు 10 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాల నుండి ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చుకొని గ్రామ పార్టీ నీ తమ కుటుంబంగా భావించి మానుకోట శాసనసభ్యులు మురళీనాయక్, ఎంపీ బలరాం నాయక్ గెలుపులో ప్రధాన భాగస్వాములు అయినటువంటి మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు నరేటి కొమురయ్య నీ,వారి గ్రామ కమిటీ మొత్తాన్ని, కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని పేరు పేరు నా అభినందించి, శాలువాల తో సన్మానించారు…

మళ్ళీ కొత్తతరానికి కూడా అవకాశం ఇవాలనే ఒక మంచి ఉదేశ్యం తో నూతన కమిటీ ఏర్పాటులో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తం ఒక్కమాట మీద ఉండి ఏకగ్రీవ తీర్మానం తో కమిటీ నీ బలపరచడం అభినందనీయమని,వారి శ్రమను గుర్తించి ,వారి అనుభవాన్ని గుర్తించి మండల కాంగ్రెస్ పార్టీ భాలోపేతానికి అవసరంగా భావిస్తున్నామని, వారికీ మండల కాంగ్రెస్ పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కదిర సురేందర్,అన్నారం సర్పంచ్ పృథ్వీరాజ్,ధర్మారం సర్పంచ్ ఈశ్వరమ్మ నంద్యానాయక్, గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ భాస్కర్,మాజీ సర్పంచ్ కదిర స్రవంతి ప్రకాష్ గౌడ్, వార్డ్ సభ్యులు,మాజీ గ్రామ కమిటీ సభ్యులు,గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం,యువజన నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *