క్షణాల్లో స్పందించి నగదు, ఆభరణాలతో కూడిన బ్యాగును సురక్షితంగా అందజేత

స్టేషన్ ఘన్‌పూర్ నవంబర్ 22(ఈ69న్యూస్ -తెలుగు గళం న్యూస్)

రైలులో ప్రయాణిస్తూ మర్చిపోయిన బ్యాగును బాధితురాలికి సురక్షితంగా అప్పగించి ఘన్‌పూర్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు.మహారాష్ట్ర రాష్ట్రంలోని భీమండి ప్రాంతానికి చెందిన ఆడేం సరిత, భర్త శ్రీనివాస్‌తో కలిసి ఈరోజు ఉదయం కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తూ జనగామలో దిగాల్సి ఉండగా, తన వెంట తెచ్చుకున్న బ్యాగును రైలులోనే మర్చిపోయి దిగిపోయారు.కొద్దిసేపటికే విషయం గుర్తించిన ఆమె వెంటనే ఘన్‌పూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.దీంతో ఇన్‌స్పెక్టర్ వెంటనే స్పందించి బ్లూకోల్ట్స్ సిబ్బంది చి. మల్లేష్, నితిన్‌లకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది ఘన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైలులో బాధితురాలు ప్రయాణించిన బెర్త్ వద్ద ఉన్న బ్యాగును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.అనంతరం బాధితురాలికి సమాచారం అందించి బ్యాగును సురక్షితంగా అప్పగించారు.ఆ బ్యాగులో రూ.4 వేల నగదుతో పాటు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు ఉన్నాయి.ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి, విలువైన వస్తువులతో కూడిన బ్యాగును తిరిగి అందజేసిన ఘన్‌పూర్ పోలీసుల తీరుపై బాధితురాలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ప్రజలకు ఆపద సమయంలో అండగా నిలుస్తూ, తక్షణమే స్పందించిన ఘన్‌పూర్ పోలీసుల సేవలను పలువురు అభినందిస్తున్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *