తెలుగు సబ్జెక్ట్ చెప్పనందుకు విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులు!తెలుగు సబ్జెక్ట్ చెప్పనందుకు విధుల నుంచి తొలగిస్తామని బెదిరింపులు!

ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తనపై హెడ్‌మాస్టర్ ఉమాదేవి అనుచితంగా వ్యవహరిస్తున్నారని ఒకేషనల్ టీచర్ పెరుమాండ్ల శారద ఆరోపించారు.తనకు కేటాయించిన ఒకేషనల్ టీచర్ విధులను నిర్వహిస్తున్న సమయంలో, ఇటీవల హెడ్‌మాస్టర్ ఉమాదేవి తెలుగు సబ్జెక్టు బోధించాలని కోరారని శారద తెలిపారు. అయితే తాను ఒకేషనల్ టీచర్‌నని, తెలుగు సబ్జెక్టు బోధించడం తనకు సాధ్యం కాదని, అవసరమైతే సంబంధిత నోటు పుస్తకాలు రాయించగలనని చెప్పినట్లు వెల్లడించారు.దీంతో హెడ్‌మాస్టర్ ఉమాదేవి తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తాను చెప్పిన పని చేయడం లేదని, సంస్కారం లేదని దురుసుగా మాట్లాడారని ఆరోపించారు. అంతేకాకుండా జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేస్తానని, పాఠశాలకు తన అవసరం లేదని అన్నారని పేర్కొన్నారు.అదేవిధంగా హాజరు రిజిస్టర్‌లో తనకు గైర్హాజరు వేసి, రిజిస్టర్ మిస్ అయిందంటూ చెప్పడం జరిగిందని శారద ఆరోపించారు. తన తప్పు ఏదైనా ఉంటే సంబంధిత ఆధారాలతో తెలియజేయాలని, ఎలాంటి కారణం లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.ఈ వ్యవహారంపై జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని పెరుమాండ్ల శారద కోరారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *