మూడు దశాబ్దాల కల సాకారం.. రామాలయానికి మహర్దశ తెచ్చిన సర్పంచ్మూడు దశాబ్దాల కల సాకారం.. రామాలయానికి మహర్దశ తెచ్చిన సర్పంచ్
  • మంత్రి సీతక్క సహకారంతో బుట్టాయిగూడెంలో అభివృద్ధి పరుగులు.. రామాలయం వద్ద సీసీ రోడ్డు పనులు ప్రారంభం!
  • ఆలయ అభివృద్ధికి పెద్దపీట.. గ్రామాభివృద్ధే ధ్యేయంగా సర్పంచ్ రాంబాబు ముందడుగు!
  • ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారి సహకారంతో రామాలయం వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ జాడి రాంబాబు ప్రారంభించారు. ముందుగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. గత 30 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని రామాలయానికి సర్పంచ్ ప్రత్యేక చొరవతో ప్రహరీ గోడ, మండపం నిర్మాణం పూర్తి చేయించారు. ప్రస్తుతం ఆలయం చుట్టూ, ఆలయానికి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. లక్ష్మీ దేవర ఆలయ అభివృద్ధితో పాటు గ్రామంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి సీతక్క, సర్పంచ్ జాడి రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటి రాజబాబు, సునార్కని సాంబశివరావు, బొటా నాగేష్, పొడెం నరసింహారావు, జనగం గంగలక్ష్మి, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, యువకులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *