నల్లగొండ: అగ్రిగోల్డ్ బాధితులకు నగదు తిరిగి చెల్లింపు ప్రక్రియలో భాగంగా ఈ నెల 25 నుంచి బాండ్ల పరిశీలన చేపట్టనున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నల్లగొండ పోలీస్ శిక్షణ కేంద్రంలో రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాండ్ల పరిశీలన నిర్వహిస్తామని పేర్కొన్నారు. మండలాల వారీగా కేటాయించిన తేదీల్లో రోజుకు 250 మంది బాధితుల బాండ్లను పరిశీలిస్తామని తెలిపారు.
బాధితులు వారికి కేటాయించిన తేదీలోనే రావాలని సూచించారు. డిపాజిటర్ మరణిస్తే నామిని, వారసులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.
వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
📞 08682-222423
📞 8712670421

