సొంత వర్గాల్లోనే అసంతృప్తి..బీఆర్ఎస్ నేతలతో మళ్లీ టచ్‌లోకి పాత అనుచరులు?

స్టేషన్ ఘనపూర్ నవంబర్ 28(ఈ69న్యూస్ -తెలుగు గళం న్యూస్)

స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయాల్లో 32 ఏండ్ల అనుభవం ఉన్న సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి చుట్టూ అసమ్మతి చర్చలు వేడెక్కుతున్నాయి.తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్‌లో కీలక నేతగా ఎదిగి, ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరిన ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన..నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని చెబుతున్నారు.అయితే గతంలో బీఆర్ఎస్ తరఫున ఆయన విజయానికి కృషి చేసిన కొందరు నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఆయనతో ఉన్నప్పటికీ ఆయనకు దూరమవుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మరోవైపు పాత బీఆర్ఎస్ నేతలతో కొందరు అనుచరులు మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అసంతృప్తికి అసలు కారణాలేమిటి? కడియం రాజకీయ శైలిపై సొంత వర్గాల్లో ఎందుకు చర్చ జరుగుతోంది? అభివృద్ధి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్న ఆయనకు ఈ పరిణామాలు ఎలాంటి సవాళ్లు విసరనున్నాయి? రాబోయే రోజుల్లో స్టేషన్ ఘన్‌పూర్ రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయి?
మరిన్ని ఆసక్తికర వివరాలు, రాజకీయ విశ్లేషణతో పూర్తి ప్రత్యేక వార్తా కథనం అతి త్వరలో..ఈ69న్యూస్ -తెలుగు గళం దినపత్రికలో..

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *