24 గంటలలో దొంగలను పట్టుకున్న పోలీసులు
భద్రాచలం దొంగతనం కేసు నమోదు కాగా DSP ఆదేశాల మేరకు భద్రాచలం పట్టణ SI పి.శ్యాం ప్రసాద్ భద్రాచలం పోలీస్ స్టేషన్ సిబ్బందితో ఈ కేసు విచారణలో బాగంగా సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు మరియు ఇతర సమాచారాన్ని సేకరించి నిన్న 09.06.2026 నాడు DSP భద్రాచలం ఆదేశాల మేరకు రాత్రి సమయంలో భద్రాచలం పట్టణ SI పి.శ్యాం ప్రసాద్, భద్రాచలం పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు ఊరు చివరన వీరభద్ర ఫంక్షన్ హాల్ ముందు వాహనాల తనిఖి చేయుచుండగా నలుగురు దొంగలను పట్టుకొని వారి వద్ద నుండి నాలుగు మోటార్ సైకిళ్ళను స్వాదిన పర్చుకున్నారు. వారు అంత కూడా నల్గొండ ప్రాంతానికి చెందిన వారు అని. వాళ్ళు అంత కూడా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతు గతంలో హైదరాబాద్, ఖమ్మం మరియు తదితర ప్రాంతాలలో పలు మోటార్ సైకిల్ దొంగతనలు చేసినారు. వీరు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళను ఓడిస్సా వెళ్లి అక్కడ గంజాయి సరపరా చేసే గంజాయి వ్యాపారులకు ఇట్టి దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు ఇచ్చి వారి వద్ద నుండి గంజాయి తీసుకొని అట్టి గంజాయి రవాణా చేస్తుండేవారు. ఈ క్రమంలో వీరు దొంగతనం చేసిన నాలుగు మోటార్ సైకిళ్ళు వేసుకొని ఓడిస్సా వెళ్లి అక్కడ వీరు దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళు ఇచ్చి గంజాయి తీసుకొని రావడానికి వెళుతుండగా వీరభద్ర ఫంక్షన్ హాల్ ముందు నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ రోజు నలుగురు దొంగలను భద్రాచలం పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ పి.శ్యాం ప్రసాద్ గౌరవ న్యాయస్థానం ముందు హాజరు పరచగా న్యాయస్థానం వారిని రిమాండ్ నిమిత్తం జైలుకు పంపడం జరిగింది. ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన భద్రాచలం టౌన్ అధికారులను మరియు పోలీస్ సిబ్బందిని భద్రాచలం DSP అభినందించారు. ప్రజలు తమ వాహనాలను భద్రమైన ప్రదేశాలలో పార్క్ చేయాలని, తాళాలు తప్పనిసరిగా వేయాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని భద్రాచలం పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.