30న లేబర్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి
భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చట్టాలన్నీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడ్ లుగా తెచ్చి కార్మికులకు జీవనోపాధి కోల్పోయే విధంగా పని గంటలు పెంచి పని భద్ర లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు కందునూరి శ్రీనివాస్ అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈనెల 30న హైదరాబాదులో సంక్షేమ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం భవనిర్మాణ కార్మికుల అడ్డా వద్ద కరపత్రాలతో సిఐటియు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రైవేటు కరణ చేయవద్దని,ప్రమాద, సహజ మరణాలకు ఇస్తున్న బెనిఫిట్స్ లలో సహజ మరణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని,పెళ్లి, ప్రసూతి కానుకలు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులపై కొనసాగిస్తున్న కక్ష సాధింపు చర్యలను ఆపాలని,కార్మికులకు కనీస వేతన చట్టం, కేంద్ర ప్రభుత్వం నాలుగు కోడులుగా తెచ్చి కార్మికులకు జీవనోపాధి కోల్పోయే విధంగా పని గంటలు పెరిగే విధంగా, పని భద్ర లేకుండా, మహిళలకు భద్రత లేకుండా పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. భవన నిర్మాణ కార్మికులు, నాయకులు అందరూ కలిసి మార్చి 30వ తేదీన ఒక్కరోజు వేతనం పోయినా సరే మన హక్కుల కోసం అందరం మన పని మానుకుని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ కె మౌలానా మేస్త్రి,జడ శ్రీను మేస్త్రి,బడుగుల వెంకన్న,సత్యం మేస్త్రి,నరసింహారావు,లాల్లు, టి. రవీందర్,కార్మికులు పాల్గొన్నారు.