5 వ వార్డ్ కౌన్సిలర్ గా పోటీలో ఉన్న అభ్యర్థి : కోనేటి అనురాధ
ఖమ్మంజిల్లా సత్తుపల్లి పట్టణం హనుమాన్ నగర్ స్థానిక నివాసులు మచ్చ రత్తయ్య కుమార్తె కోనేటి అనురాధ మున్సిపాలిటీ జరగబోయే ఎన్నికలకు 5వ వార్డ్ కౌన్సిలర్ గా బరిలోకి దిగారు. వీరి కుటుంబం గత 20 సంవత్సరాల నుండి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ , ప్రజల శ్రేయస్సు కోరుతూ , ప్రజా సేవ చేస్తున్న కుటుంబం గా గుర్తింపు పొందింది. ప్రజా సమస్య మా సమస్యగా భావించి ఏ సమయంలో అయినా సహాయపడే మంచి గుణగణాల ఉన్న కుటుంబంగా ఉంది . ఎన్నికల సమయాల్లో మాత్రమే కాకుండా, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలిగా ఆమె గుర్తింపు పొందారు. వార్డు లో ప్రతి సమస్య ఆమె దృష్టికి తీసుకురావచ్చు అన్న నమ్మకం ప్రజల్లో ఉంది. రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా, మంచి మనిషిగా గుర్తింపు పొందడం ఆమెకు లభించిన అతిపెద్ద బలం. ఆమె ఉన్న కాలనీలో ఉన్న హనుమాన్ గుడి కి 1 లక్ష రూపాయలు మంచి మనసుతో విరాళంగా ఇచ్చారు , సుమారు 2002 నుండి 2003 మధ్య సంవత్సర కాలంలో సత్తుపల్లి పాత బస్టాండ్ వద్ద ప్రయాణికులకు విశ్రాంతి తీసుకోవడానికి బస్సు షెల్టర్ నిర్మించారు. అంతేకాకుండా 2018 వ సంవత్సరంలో హనుమాన్ గుడికి పెయింటింగ్ కూడా వేయించారు. నిరంతరం పేదవారు హాస్పిటల్లో ఉన్నప్పుడు వారికి సహాయంగా హాస్పిటల్ నిమిత్తం , పెళ్లిళ్లు చేసుకునే వారికి ఆర్థికంగా సహాయం చేసేవారు. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి.. ఇలాంటి గొప్ప కుటుంబాన్ని మనము ఎన్నుకుంటే ఇంకా ఎన్ని మంచి పనులు చేస్తారో ఆలోచించండి.. కోనేటి అనురాధ గెలిచిన తర్వాత అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ లు, డ్రైనేజీలు నిర్మాణం , ఇండ్ల స్థలం లేని వారికి ఇళ్ల స్థలాలు మంజూరు , వృద్ధులకు దివ్యాంగులకు అర్హులైన ప్రతివారికి ఆసరా పింఛనులు , రేషన్ కార్డులు , ఆరోగ్యశ్రీ కార్డులు చేస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి కి శివారులో ఉన్న వేశ్య కాంతుల చెరువు పూడ్చివేసి , దానిని అర్హులైన పేదలకు ఇండ్ల స్థలాలు ఏర్పాటు చేస్తారని సమాచారం ప్రజలలోకి అందుబాటులో వచ్చింది. వజ్రాయుధలాంటి మీ ఓటు హక్కును వినియోగించుకొని , మీ వార్డు అభివృద్ధి దిశ వైపు తీసుకెళ్తామని , మీకు నిరంతరం అందుబాటులో ఉండే కుటుంబం కోనేటి కుటుంబం.