ఈ69న్యూస్ వరంగల్,జూలై 19 జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం చాగల్ గ్రామ రైల్వే గేటు సమీపంలో శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి అనూమానస్పదంగా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది.ఈ సంఘటనను గమనించిన స్థానికులు స్టేషన్ ఘనపూర్ పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు స్టేషన్ ఘనపూర్ సిఐ వేణు తెలిపారు.