8వ వార్డులో దూసుకు పోతున్న కాంగ్రెస్
8 వార్డు కాంగ్రెస్ నల్లేరు పై నడకే
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
వార్డు మార్పుకోసం, అభివృద్ధికోసం వస్తున్న మీ ముందుకు అభివృద్ధే లక్ష్యం.
వార్డు ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. ఆదరించండి.
డోర్నకల్ నియోజకవర్గ ఏమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ఆశయాలతో మీ విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
మరిపెడ మున్సిపాలిటీ వరిధిలోని 8 వార్డులో విసరపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలవరిచిన అభ్యర్థి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గం ఏమ్మెల్యే ఆశీస్సులతో ప్రజల మధ్య విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ, వార్డు అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలు,8వార్డులో సమస్యలు ఉన్న పరిష్కరిస్తా నని లోతైన అవగాహనతో మీ ముందుకు వస్తున్న ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రతి ఇంటింటికి చేరువయ్యే విధంగా ఆయన ప్రచారం స్థానికంగా విశేషంగా మారింది. వార్డులో తాగునీటి సమస్యలు, డ్రైనేజీవ్యవస్థలు,వార్డులో రహదారులు, అభివృద్ధి సమస్యలు, వీధి దీపాల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణ వంటి మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూవడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుంటూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ప్రజా ప్రతినిధిగా నిలుస్తానని వారు హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా వృద్ధులకు, మహిళలకు, యువతకు, పేద వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని అలాగే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్యంలో చేపట్టిన పధకాలను వార్డు స్థాయిలో అమలు చేయడమే తన లక్ష్యం అని అన్నారు. గతంలో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవమే తన రాజకీయ ప్రయాణానికి బలమని ఆయన అన్నారు.8 వార్డును కాంగ్రెస్ విజయం ఎప్పుడో కాయం అయింది అని నాయకులు, ప్రజలు అభిప్రాయ పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ పథకాలు అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే నా సంకల్పం, ప్రజల నమ్మకమే నా బలం, ప్రతి కుటుంబానికి అందు బాటులో ఉండే కౌన్సిలర్గా వని వేస్తానని వారు హామీ ఇచ్చారు. మీ అమూల్యమైన ఓటు సీరియల్ నెంబర్ 2 చేతి గుర్తుపై వేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను వేడు కుంటున్నాను. వార్డు భవిష్యత్తును కలిసి నిర్మిద్దాం అని ప్రజలను కోరారు. ప్రచారంలో భాగంగా ఇంటింటి సందర్శనలు, సమావేశాలు, యువతతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తూ, ప్రజలతో నేరుగా మమేకమవుతున్న అనూహ్యంగా మంచి ఆదరణ లభిస్తున్నట్లు స్థానికులు తెలియ జేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమైన కేడర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పధకాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసం అభ్యర్థి వ్యక్తిగత చొరవ కలిగి 8 వార్డులో కాంగ్రెస్ కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వర్గాలు చెపుతున్నాయి. అలాగే వార్డు ప్రజల అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యువత యువకులకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.