15 ఏళ్ల బాలుడు అదృశ్యం — పోలీసులు గాలింపు 15 ఏళ్ల బాలుడు అదృశ్యం — పోలీసులు గాలింపు

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధిలో చదువుతున్న 15 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.చౌటుపర్తి గ్రామానికి చెందిన యెలగొండ హేమంత్ అనే బాలుడు ఈ నెల 14వ తేదీ రాత్రి హాస్టల్ నుంచి వెళ్లిపోయి కనిపించకుండా పోయాడు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.అదృశ్యమైన బాలుడు జయగిరి గ్రామంలోని MJP స్కూల్ / బీసీ హాస్టల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు.ఘటనపై సమాచారం అందుకున్న హసన్‌పర్తి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.బాలుడి వివరాలు ఇలా ఉన్నాయి: హేమంత్ వయస్సు 15 సంవత్సరాలు. ఎత్తు సుమారు 4 అడుగుల 6 అంగుళాలు. చర్మం నల్లగా, ముఖం గుండ్రంగా ఉంటుంది. జుట్టు నల్లగా ఉంది. ముందుభాగంలోని పై దంతాలలో ఒక పన్ను విరిగినట్లుగా పసుపు రంగులో కనిపిస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. చివరిసారిగా బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ మరియు పింక్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ షర్ట్ ధరించి ఉన్నట్లు గుర్తించారు.బాలుడు అదృశ్యమైన ప్రదేశం జయగిరి గ్రామం, హసన్‌పర్తి మండలం, హనుమకొండ జిల్లా పరిధిలో ఉంది. ఎవరైనా బాలుడిని గమనించినట్లయితే వెంటనే హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:
PS హసన్‌పర్తి: 8712685015
SI హసన్‌పర్తి: 8712685097
బాలుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే సమాచారం అందించి కుటుంబ సభ్యులకు సహకరించాలని పోలీసులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *