వైరా మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ కైవసం
చైర్మన్గా డాక్టర్ కాపా చంద్రకళ , వైస్ చైర్మన్గా [ కట్ల సంతోష్ ] గత కొద్దిరోజులుగా ఖమ్మంజిల్లా వైరా మున్సిపాలిటీ లో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైరా మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీలోని 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని, నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ కాపా చంద్రకళ.. వైస్ చైర్మన్ అభ్యర్థిగా కట్ల సంతోష్ ను ఎన్నుకోవడం జరిగింది