న్యూఢిల్లీ/హైదరాబాద్:
తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా Errabelli Swarna నియమితులయ్యారు. ఈ మేరకు All India Congress Committee (AICC) శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు Mallikarjun Kharge ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి K. C. Venugopal వెల్లడించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని ఆయన తెలిపారు.రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం, మహిళల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం, పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విస్తరించడంలో ఎర్రబెల్లి స్వర్ణ కీలక పాత్ర పోషించాలని పార్టీ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నాయకత్వంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *