పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం!
- అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ధ్యేయం
- ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం – మండల పార్టీ అధ్యక్షులు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు
తెలుగు గళం మంగపేట, అక్టోబర్ 29:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెట్టిపెల్లి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం ములుగు జిల్లా మంగపేట మండలంలోని చెరుపల్లి గ్రామంలో మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో పార్టీ నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీతో పాటు ప్రజలకు మెరుగైన సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం డైరెక్టర్ పూజారి సురేందర్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి యంపెల్లి వీరస్వామి, బీసీ సెల్ మండల అధ్యక్షుడు ముత్తినేని ఆదినారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బసారీకారి హరికృష్ణ, ఏటూరునాగారం ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు, శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం డైరెక్టర్ బోడ బొరయ్య, నాయకులు లొంక రాజు, బరపాటి నర్సింహారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, జీపీఓ, రేషన్ డీలర్ తదితరులు పాల్గొన్నారు.
