
ఈ69న్యూస్ హసన్పర్తి, మార్చి 24హసన్పర్తి మండల పరిధిలో సోమవారం రోజు అధికారులు పాన్ షాపులు మరియు కిరాణా దుకాణాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా నిషేధిత గుట్కా పదార్థాలతో పాటు పెద్ద మొత్తంలో సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలను అరికట్టేందుకు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించిన దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, అక్రమంగా విక్రయాలు జరిపిన వారిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉందన్నారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.