కుల వివక్ష నిర్మూలన దిశగా కేవీపీస్ కృషి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమేల మండలం పంకెన గ్రామానికి చెందిన కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీస్) జిల్లా నాయకులు పలిమేల పోలీస్ స్టేషన్ ఎస్సై రమేష్‌ను కలిసి ఆయన చేతుల మీదుగా కేవీపీస్ డైరీని ఘనంగా ఆవిష్కరింపజేశారు.ఈ కార్యక్రమం సామాజిక సమానత్వం, కుల వివక్ష నిర్మూలన లక్ష్యంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష నిర్మూలన కోసం కృషి చేస్తున్న కేవీపీస్ నాయకులను అభినందించారు. సమానత్వం నెలకొల్పడంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, సమాజంలో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని సూచించారు.అనంతరం కేవీపీస్ జిల్లా నాయకులు మాట్లాడుతూ, సమానత్వం, ఆత్మగౌరవం మరియు కుల నిర్మూలన కేవీపీస్ ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సంఘంలో చేరి సామాజిక మార్పుకు తోడ్పడవచ్చని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం, జిల్లా, దేశవ్యాప్తంగా కేవీపీస్ ఉద్యమాలు చేపడుతోందని వివరించారు.కులాంతర వివాహితుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ, సమాజంలో సమాన హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ సంఘం ఇప్పటివరకు అనేక సామాజిక సమస్యల పరిష్కారంలో విజయాలు సాధించిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేవీపీస్ జిల్లా ఉపాధ్యక్షులు పాగె పొట్టయ్య, జిల్లా సహాయక కార్యదర్శి పాగె సంతోష్‌తో పాటు సంఘ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.