సీఎం పర్యటన నేపథ్యంలో ఇసుక రవాణాపై నిషేధం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూపాలపల్లి జిల్లాలో సోమవారం నిర్వహించనున్న పర్యటన నేపథ్యంలో, రేగొండ, చిట్యాల,టేకుమట్ల మండలాల్లో ఇసుక రవాణాపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు.ఏప్రిల్ 20న జిల్లాలో ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగనున్నందున భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేగొండ పోలీసులు వెల్లడించారు.ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక ట్రాక్టర్లు నడపరాదని స్పష్టంచేశారు.ఆదేశాలను ఉల్లంఘించి ఇసుక రవాణా చేపట్టినట్లయితే సంబంధిత వాహన యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు, ట్రాక్టర్ యజమానులు పోలీసుల సూచనలు పాటించి సహకరించాలని కోరారు.సీఎం పర్యటనను ప్రశాంతంగా,విజయవంతంగా నిర్వహించేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.