జగిత్యాల బహిరంగ సభను విజయవంతం చేద్దాం
జగిత్యాల జిల్లా కేంద్రంలో నేడు సోమవారం నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) బహిరంగ సభను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని శ్రీ పద్మ వంశీ చేనేత సహకార సంఘం మాజీ అధ్యక్షులు బిర్రు ఇస్తారి పిలుపునిచ్చారు.
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తో పాటు వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరనున్నారని తెలిపారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతమని అన్నారు.
సభ విజయవంతం కోసం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని, ముఖ్యంగా జనగాం ఎమ్మెల్యే డాక్టర్ పల్లె రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్, డాక్టర్ పల్లె రాజేశ్వర్ రెడ్డి నాయకత్వంలో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పక్క ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆయన సూచించారు. జగిత్యాల గడ్డపై గులాబీ జెండా ఎగరబెట్టి, తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.
అందరూ కలిసి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.