
స్టేషన్ ఘనపూర్, ఏప్రిల్ 24 (ఈ69న్యూస్)
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.నర్సంపేటకు వెళుతున్న సమయంలో చిల్పూర్ ఎస్సై సిరిపురం నవీన్ కుమార్ ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ సమ్మెలో భాగంగా కిరోసిన్ పోసుకొని ఆస్పత్రిలో మృతి చెందగా, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు నర్సంపేటకు వెళుతున్న సందర్భంలోనే ఈ అరెస్ట్ జరిగింది.అరెస్ట్‌పై శ్రీనివాస్ గౌడ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న తనను అడ్డుకోవడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం అన్యాయమని పేర్కొన్నారు.ప్రభుత్వం అరెస్టులు, నిర్బంధాలు చేయడం కొత్త విషయం కాదని విమర్శించారు.ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అరెస్ట్‌ను ఖండించారు. ప్రభుత్వం ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.