ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య
రాంపురం ప్రధానోపాధ్యాయులు హీరాలాల్,ఉపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని పిల్లలందరిని కూడా బడిలో చేర్పించి మన పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ప్రాథమిక పాఠశాల రాంపురం ప్రధానోపాధ్యాయులు హీరాల లాల్ మరియు ఉపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ అన్నారు.బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వార్డు సభ్యులు సతీష్ ,తల్లిదండ్రులతో కలిసి అంబేద్కర్ విగ్రహం దగ్గర పాఠశాల యొక్క మౌలిక వసతులు మరియు ప్రత్యేకతలకు సంబంధించినటువంటి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కరపత్రాన్ని ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు పంచి పెడుతూ ముందస్తుగానే రాంపురంలోని పిల్లలు కలిగినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను ఎండను సైతం లెక్కచేయకుండా మండుటెండల్లో ప్రతి ఒక్కరిని కలిసి పాఠశాలలో అత్యున్నతమైన విద్యార్హతలు,అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నామని అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాం ,సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు వీటితో పాటుగా వచ్చే సంవత్సరం పాలు ,బ్రేక్ ఫాస్ట్ ,బ్యాగు, షూ వంటి అన్నింటిని కూడా ఉచితంగానే అందిస్తుందని ప్రభుత్వం అందించేటువంటి ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని అనుభవజ్ఞులైన అన్ని సౌకర్యాలు కలిగినటువంటి మన పాఠశాలలో చదివించి పాఠశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా తోడ్పడాలని కోరారు,ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు అప్పటికప్పుడే స్పందించి తమ పిల్లల్ని ఇంటి దగ్గరే అడ్మిషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో బంధు పరశురాములు, సుదగాని శ్రీను, సుదగాని హరీష్, నాగబెల్లి సురేష్ మరియు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.