ప్రజా ప్రభుత్వంలో రైతులే రాజులు
వరంగల్ జిల్లా:పర్వతగిరి మండలంలోని కల్లెడ,మాల్యా తండా,మూడెత్తుల తండా, ఏనుగల్లు,చింతనెక్కొండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్, స్థానిక సర్పంచ్లు, అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల తహసీల్దార్ వెంకటస్వామి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి రైతుకు అందేలా అధికార యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు.జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు దేవేందర్ రావు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రైతులను రాజులు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు నాయకత్వంలో కృషి చేస్తున్నామన్నారు.రైతులకు సబ్సిడీ విత్తనాలు, పనిముట్లు, రైతు భరోసా లాంటి పథకాలతో అండగా నిలుస్తున్నామని చెప్పారు.మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ కేవలం పర్వతగిరి మండల రైతులకే 1.64 కోట్ల రూపాయల బోనస్ అందిందని, దేశంలో రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు. గత ప్రభుత్వం తాలు పేరుతో క్వింటాకు ఐదారు కిలోలు దోచుకుని రైతులను మోసం చేసిందని, కానీ తమ ప్రభుత్వం రైతు పండించే ప్రతి గింజా కొనుగోలు చేసి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమాల్లో సర్పంచ్లు తక్కలపల్లి శ్రీనివాస్, మంజుల శ్రీనివాస్, లక్పతి, తోర్రి పద్మ కుమార్ యాదవ్, గడుధుల రవి యాదవ్, గ్రామ పార్టీ అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు యాకుబ్ నాయక్, రతన్ రావు, చలపతిరావు,భిక్షపతి, జిల్లా కుమార్, ధోని సంపత్,వివిధ శాఖల అధికారులు,మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.