హనుమకొండ జిల్లా:ఐనవోలు మండల కేంద్రంలోని కోమటి కుంట వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ పరిశీలించారు.ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పనుల వద్ద గ్రీన్ షేడ్ నెట్‌తో పందిరి ఏర్పాటు చేయించారు.అనంతరం కూలీలందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, చల్లని మంచినీటి క్యాన్లను స్వయంగా అందించారు.వేసవిలో కూలీల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ తెలిపారు.సర్పంచ్ స్వయంగా కూలీలతో కలిసి పనుల్లో పాల్గొని వారిలో ఉత్సాహం నింపారు. సర్పంచ్ చొరవపై ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బరిగాల భాస్కర్, వార్డు సభ్యులు శాతండ్ల కుమార్,ఆశా వర్కర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.