హసన్ పర్తి స్టేషన్ హౌజ్ ఆఫీసర్ గా ఏ.మహేందర్
హనుమకొండ జిల్లా
హసనపర్తి పోలీస్ స్టేషన్కు నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా ఇన్స్పెక్టర్ ఏ. మహేందర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏ. మహేందర్ మాట్లాడుతూ, ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం పెంచే విధంగా సేవలు అందిస్తామని పేర్కొన్నారు.ప్రజలు తమ సమస్యలను నిరభ్యంతరంగా పోలీస్ స్టేషన్కు వచ్చి తెలియజేయాలని ఆయన కోరారు.