ప్రజా సమస్యలు పరిష్కారం ద్వారా అధిక స్థానాల్లో గెలవాలి - బివి రాఘవులు
గతంలో ఖమ్మం నగరంలో సమర్థవంతమైన పాలన అందించిన ఘనత సిపిఎం పార్టీకి వుంది అని, ప్రజలకు మరింత చేరువగా వుండటం ద్వారా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో పార్టీ గెలవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అని సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు తెలిపారు. సోమవారం సుందరయ్య భవనంలో జరిగిన పార్టీ ఖమ్మం డివిజన్ వర్క్ షాప్ జిల్లా కమిటీ సభ్యులు భుక్యా శ్రీనువాసురావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోలిట్ బ్యూరో నుంచి బివి రాఘవులు హాజరు అయి క్యాడర్ కు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఛైర్మన్ గా చిర్రావూరి లక్ష్మి నర్సయ్య, ఆతర్వాత కాలంలో మరోసారి మున్సిపల్ ఛైర్మన్ గా సమీనా అప్రోజ్ చిత్తశుద్ధితో నిజాయితీగా, అత్యంత సమర్థవంతంగా పరిపాలన చేశారు అని తెలిపారు. భవిష్యత్ ఖమ్మం నగర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఆనాడే త్రాగు నీరు సౌకర్యం, విశాలంగా రహదారులు, తదితర మౌలిక సదుపాయాలు ఆ కాలంలోనే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కల్పించారు అని తెలిపారు. ఈరోజు ఖమ్మం నగరంలో ఏ సమస్యలు వచ్చినా ప్రజల వైపు నిలబడి నిత్యం ఆందోళనలు చేయడం ద్వారా మరింతగా ప్రజలకు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సిపిఎం పార్టీ ఒక కారణం అని తెలిపారు. ప్రజలతో మరింతా మమేకమై ప్రజా సమస్యలు పరిష్కారం రాబోయే ఎన్నికల్లో ద్వారా అధిక స్థానాల్లో కార్పొరేటర్లు గెలవడానికి తగిన ప్రణాళిక చేసుకోవాలి అని సూచించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సమస్యలు గాలికి వదిలేసి దేశ సంపద అంతా అదానీ, అంబానీ లకు ధారాదత్తం చేసే పనిలో మోడీ బిజీగా ఉన్నారు అని విమర్శించారు. రోజూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాలు పడుతున్నాయి అని ఆరోపించారు. రాబోయే కాలంలో మోడీ వ్యతిరేకంగా ప్రజా ఆందోళనలు విస్తృతంగా చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బొంతు రాంబాబు, యర్రా శ్రీనువాసురావు, నాయకులు బండారు రమేష్, దొంగల తిరుపతిరావు, జబ్బర్, ఎస్ నవీన్ రెడ్డి, మీరా సాహిబ్, పి రమ్య, బోడపట్ల సుదర్శన్, నాగులు మీరా, ఉపేంద్రర్, మాజీ కార్పొరేటర్లు యర్రా గోపి, ఎల్లంపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు