గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలి
పర్వతగిరి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఎంపీడీవో శంకర్ నాయక్, ఎంపీ ఓ శేషాద్రిగారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షులు నకరకంటి రామచందర్ మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలు రోగాల బారి నుండి కాపాడుతున్నటువంటి పంచాయతీ కార్మికులను అటువంటి పారిశుద్ధ కార్మికులను ఏళ్ల తరబడి పని చేసిన పని భద్రత లేకుండా పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం కార్మికులకు చెల్లించే వేతనాలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని పర్మినెంట్ కనీస వేతనాలు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని 2018 సంవత్సరంలో గత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి నష్టదాయకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 51 సవరించి వందలాదిమంది పంచాయతీ కార్మికులు చావుతోనైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఈ చావులకు కారణమైన మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని మరణించిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం కల్పించాలని పంచాయతీ కార్మికులకు 10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కారోబార్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి ఒకటవ తేదీన వేతనాలు చెల్లించాలని ప్రభుత్వానికి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అధికారులకు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల అధ్యక్షులు నకరకంటి రామచందర్, మండల ఉపాధ్యక్షులు భాష, మండల ప్రధాన కార్యదర్శి రాజసాగర్, కార్యదర్శి రజిని బాబు, శ్రీకాంత్, జిల్లా సభ్యులు మౌనిక, కళా,నీల, లక్ష్మణ్, ప్రభాకర్,కొమురమ్మ రంగమ్మ, మంజుల, రమ సమ్మయ్య,మహేందర్,వెంకన్న తారమ్మ, చంద్రకళ, పద్మ తదితరులు పాల్గొన్నారు.