గ్రామ గ్రామాన జెండా ఆవిష్కరణ
ఉదయం 8 గంటలకు ప్రతి గ్రామంలో జాతీయ, గులాబీ జెండాలు ఎగురవేయాలి
తెలంగాణ గర్వం ప్రతి ఇంటా వెల్లివిరియాలి: ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు పర్వతగిరి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని (జూన్ 2న) పర్వతగిరి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 8 గంటల లోపు జాతీయ జెండాతో పాటు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఆవిష్కరించాలని మాజీ మండల అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు.పర్వతగిరి మండల అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు.”తెలంగాణ ఆవిర్భావంతో గ్రామ గ్రామాన గులాబీ జెండా రెపరెపలాడాలి. తెలంగాణ గర్వం ప్రతి ఇంటా వెల్లివిరియాలి” అని అన్నారు.
అనంతరం ఉదయం 9 గంటలకు పర్వతగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా మరియు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమానికి ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు, మండల సీనియర్ నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మైనారిటీ నాయకులు,వివిధ గ్రామ నాయకులు,కార్యకర్తలు, యూత్ నాయకులు,సోషల్ మీడియా నాయకులు అందరూ సకాలంలో హాజరై ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు కోరారు.