వడదెబ్బతో ఆటో డ్రైవర్ మృతి
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన ఎం.డి. షబ్బీర్ (తండ్రి.సోయబ్ హుస్సేన్) వడదెబ్బ కారణంగా మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, షబ్బీర్ నిన్న సాయంత్రం తీవ్ర ఎండలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వడదెబ్బకు గురయ్యారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు సమాచారం.
మృతుడు వర్ధన్నపేటలో ఆటో డ్రైవర్గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న షబ్బీర్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
వడదెబ్బల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.