
వరంగల్: మామునూరు గ్రామంలో సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ గుండు నాగభూషణ్‌పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. కారులో వచ్చిన దుండగులు ఆయనను అడ్డగించి, మెడలో ఉన్న సుమారు రెండు తులాల బంగారు చైన్‌ను బలవంతంగా లాక్కెళ్లినట్లు సమాచారం.
దుండగులను అడ్డుకునే ప్రయత్నంలో జరిగిన పెనుగులాటలో నాగభూషణ్కు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మామునూరు గ్రామంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.