అంగన్వాడి కేంద్రాలకు పిల్లల తల్లిదండ్రుల ఆదరణ
అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు ఆటపాటల నిలయంగా కొనసాగుతూ విద్యకు అక్షరాభ్యాసానికి మొదటి ప్రాధాన్యత అంగన్వాడి కేంద్రాలు రూపుదిద్దుకోవడం తో పిల్లల ఆదరణ సెంటర్లలో పెరుగుతుంది. శుక్రవారం రేగొండ మండల కేంద్రంలోని ,4. 1 అంగన్వాడి కేంద్రాలలో అంగన్వాడి టీచర్లు నామాల రజిత, మాడగాని సుజాత లు ఏర్పాటుచేసిన బాలామృతం, అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక , డ్వాక్రా గ్రూప్ మహిళ అధ్యక్షురాలు మార్క సుమలత, తల్లుల కమిటీ సభ్యులు పాల్గొని బాలామృతం ప్యాకెట్లను, గ్రుడ్లు అందజేశారు. అనంతరం స్థానిక ఎస్సై సుధాకర్ కుమార్తకు సర్పంచి మౌనిక,అంగన్వాడి టీచర్ రజిత చేతుల మీదుగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే మాడగాని సుజాత ఏర్పాటు చేసిన అక్షరాభ్యాసం కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మౌనిక మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణ ఆటపాటలు, ఆరోగ్యం,పరిశుభ్రతతో పాటు విద్యకు మొదటి నిలయంగా పొందుతున్న అంగన్వాడి కేంద్రాలను పిల్లలను పంపించాలని సర్పంచ్ కోరారు. ప్రైవేటు విద్యార్కు బదులు అందుబాటులో ఉన్న అంగన్వాడి కేంద్రాలకు ప్రముఖులు విద్యావేత్తలు వ్యాపారస్తుల, పోలీస్ సిబ్బంది పిల్లల సైతం అంగన్వాడి కేంద్రాలకు తీసుకురావడంతో అంగన్వాడి కేంద్రాలకు ఆదరణ పెరుగుతుందని కేంద్రాల టీచర్లు రజిత సుజాత ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచి మౌనిక తో పాటు పిల్లల తల్లులు, డ్వాక్రా గ్రూప్ మహిళ సంఘం అధ్యక్షురాలు మార్క సుమలత, ఆశ వర్కర్లు సాధనపెళ్లి సప్న, మదర్స్ కమిటీ సభ్యురాలు పాల్గొన్నారు