20 ఏళ్ల తర్వాత వరంగల్‌కు మహిళా పోలీస్ కమిషనర్20 ఏళ్ల తర్వాత వరంగల్‌కు మహిళా పోలీస్ కమిషనర్
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 July, 2026E69NEWS

20 ఏళ్ల తర్వాత వరంగల్‌కు మహిళా పోలీస్ కమిషనర్

20 ఏళ్ల తర్వాత వరంగల్‌కు మహిళా పోలీస్ కమిషనర్

వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా రెడ్డిని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా రాజనాల శ్రీహరి మాట్లాడుతూ, దాదాపు 20 సంవత్సరాల తర్వాత వరంగల్‌కు మళ్లీ మహిళా పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతా రెడ్డి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.ఆమె నాయకత్వంలో వరంగల్‌లో శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.ప్రజలకు మరింత సమర్థవంతమైన పోలీసు సేవలు అందిస్తూ, తన పదవీకాలంలో విజయవంతంగా విధులు నిర్వహించాలని కోరుకుంటూ, ఆమెకు అన్ని విధాలా శుభం కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెల్ది ప్రభాకర్, గోపగోని అఖిల్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *