అక్రమ సంబంధం అనుమానంతో తల్లిని హతమార్చిన కుమారుడు

హనుమకొండ, సెప్టెంబర్ 24 (ఈ69 న్యూస్): హనుమకొండ జిల్లా కాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని డీజిల్‌ కాలనీ బాలాజీనగర్‌లో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో ఓ యువకుడు తన తల్లిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం.స్థానికుల కథనం ప్రకారం.. ఉదయశ్రీ (40) విషయంలో ఆమె కుమారుడు దొరబాబు (20) కొంతకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై తల్లిని పలుమార్లు మందలించినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదన్న ఆగ్రహంతో దొరబాబు గురువారం మేడపై తన తల్లి ఉదయశ్రీపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దొరబాబు డిగ్రీ చదువుతున్నట్లు తెలిసింది.సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. హత్యకు దారితీసిన పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *