ఈ69న్యూస్ వరంగల్/వర్ధన్నపేట, సెప్టెంబర్ 24

వర్ధన్నపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్‌గా అబ్బిడి రాజీరెడ్డి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఆయనతో పాటు నూతన పాలకవర్గ డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి అబ్బిడి రాజీరెడ్డి, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీగా వర్ధన్నపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకున్నారు.డీసీసీబీ బ్యాంకు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో అబ్బిడి రాజీరెడ్డి చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మండలంలోని రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు.రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందేలా కృషి చేస్తానని, పీఏసీఎస్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సహకార సంఘం సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న, టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, పర్వతగిరి సొసైటీ చైర్మన్ పిన్నింటి అనిల్‌రావు, చౌటపల్లి సొసైటీ చైర్మన్ అత్తి కుమారస్వామి, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ మండల యువజన అధ్యక్షుడు ప్రతి భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.అలాగే మండలంలోని సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సహకార రంగ ప్రముఖులు, రైతులు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అనంతరం నూతన చైర్మన్ అబ్బిడి రాజీరెడ్డిని పలువురు నాయకులు, రైతులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కందిక ఎల్లమస్వామి, చిదుముల్ల భాస్కర్, తాటికాయల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

oplus_144703488

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *