
వరంగల్, అక్టోబర్ 2 (ఈ69 న్యూస్)
మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, వరంగల్ ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.అబ్బనీకుంటలోని మహాత్మా గాంధీజీ విగ్రహానికి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ చైర్మన్ బేతి అశోక్ బాబు, వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, హనుమకొండ టిఎన్జీవోస్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్, పాలక మండలి సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.గాంధీజీ సత్యం, అహింస, సేవా మార్గాలను స్ఫూర్తిగా తీసుకుని రక్తదానాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కార్యక్రమానికి హాజరైన వారితో రక్తదాన ప్రతిజ్ఞ చేయించారు.అనంతరం చేయూత గౌరవ సభ్యుడు కుడికాల శ్యామ్ ఆధ్వర్యంలో లేబర్ కాలనీలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బేతి అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బేతి అశోక్ బాబు, వైస్ చైర్మన్ శానబోయిన రాజ్ కుమార్, పాలక మండలి సభ్యులను కుడికాల శ్యామ్ ఘనంగా సన్మానించారు.అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ నూతన పాలక మండలి సభ్యులు తెలంగాణ శాసన మండలి సభ్యుడు, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సారయ్య పాలక మండలి సభ్యులను సన్మానించి అభినందించారు.భవిష్యత్తులో నిర్వహించనున్న సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేదలు, నిరుపేదలకు సేవలు అందించే అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా చైర్మన్ బేతి అశోక్ బాబు మాట్లాడుతూ గాంధీజీకి నివాళి కేవలం పూలమాలతో కాకుండా, ఆయన చూపిన సేవా మార్గాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా నిజమైన నివాళి అర్పించాలని అన్నారు. ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందిస్తూ రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేదలకు సహాయం వంటి కార్యక్రమాలను రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.కార్యక్రమాల్లో పాలక మండలి సభ్యులు కుసుమ సత్యనారాయణ, మామిడాల రమేష్ బాబు, తోట సంపత్ కుమార్, మండల పరుష రాములు, పుల్లూరు ప్రవీణ్ కుమార్, బైరి సోమన్న, కుడికాల వేణు, లక్ష్మీ ప్రసాద్, మూడేడ్ల సతీష్, బేతి రాజు, అబ్బనీకుంటకు చెందిన గడ్డమీది రాజేష్, బంక కుమారస్వామి, లకుం రవి, అనుముల జనార్ధన్, అడ్వకేట్ సురేష్, సాగర్, ఆడేపు రవి, అరుణ్ తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.