కలెక్టర్, సీపీ గ్రీవెన్స్ సెల్‌లో రైతు ఫిర్యాదు

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 7 (ఈ69న్యూస్)


“మా భూమిని కాపాడండి.. మా గోడును పట్టించుకోండి” అంటూ స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవపురం శివారులోని వ్యవసాయ భూమి వివాదంపై వడ్డేపల్లికి చెందిన కల్వచర్ల విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలోకి వెళ్లేందుకు ఉన్న దారిని పక్క భూమికి చెందిన బోడ మమత ఆక్రమించి మూసివేశారని, తమ భూమిలోనూ నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన ఆరోపించారు.కల్వచర్ల విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. తమ తండ్రి కల్వచర్ల మొగిలి పేరుతో 2011లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్వే నంబర్లు 292/సి, 292/ఏ1, 293/ఏ, 293/బి, 292/ఏ/అ, 292/ఏ/ఆలలో మొత్తం 9 ఎకరాల 29 గుంటల వ్యవసాయ భూమి ఉందన్నారు. తమ వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ఉన్న సుమారు 16 అడుగుల దారిని పక్క భూమికి చెందిన బోడ మమత ఆక్రమించి మూసివేశారని ఆరోపించారు.అంతేకాకుండా తమ భూమిలో వాటర్ ట్యాంక్‌తో పాటు ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని విష్ణు పేర్కొన్నారు. నిర్మాణాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సమయంలో బోడ మమతకు చెందిన సూపర్వైజర్ రేవెల్లి శంకర్ దుర్భాషలాడుతూ దాడికి యత్నించారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.భూమి హద్దులు, దారికి సంబంధించిన సమస్యను పరిష్కరించేందుకు సుమారు రెండు నెలల క్రితం మీ-సేవ కేంద్రం ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని విష్ణు తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా వరంగల్ సీపీ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్‌లోనూ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి తమ భూమిని సర్వే చేసి, హద్దులు మరియు దారి సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కల్వచర్ల విష్ణు కోరారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *