ఈ నెల 17న ఉదయం 4 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు.. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి

వరంగల్, ఈ69న్యూస్ అక్టోబర్ 15

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న హాఫ్ మారథాన్‌ నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ తెలిపారు. శనివారం ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ప్రజలు, ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..

హైదరాబాద్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు: ఫాతిమా జంక్షన్ నుంచి మదర్ థెరిసా సెంటర్ మీదుగా ఎడమవైపు తిరిగి వడ్డేపల్లి చర్చి, తులసి బార్, కేయూసీ జంక్షన్, నయీంనగర్, సీపీఓ జంక్షన్ మీదుగా హనుమకొండ బస్టాండ్‌కు చేరుకోవాలి.హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వాహనాలు: అశోక జంక్షన్, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, కేయూసీ, తిరుమల బార్, వడ్డేపల్లి చర్చి, ఫాతిమా సెంటర్, కాజీపేట మీదుగా వెళ్లాలి.హనుమకొండ నుంచి కరీంనగర్‌కు వెళ్లే వాహనాలు: అశోక జంక్షన్, ములుగు రోడ్డు, పెద్దమ్మగడ్డ, కేయూసీ మీదుగా ప్రయాణించాలి.ఖమ్మం నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు: సీఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకొని పోతన జంక్షన్ మీదుగా హనుమకొండకు చేరుకోవాలి.

పలు మార్గాల్లో రాకపోకలు నిలిపివేత

100 ఫీట్ల రోడ్డుపై ఒకవైపు మాత్రమే వాహనాల రాకపోకలకు అనుమతి ఉంటుంది. సీఎస్ఆర్ గార్డెన్ జంక్షన్ నుంచి అదాలత్ వైపు, అంబేద్కర్ జంక్షన్ నుంచి కాలేజీ జంక్షన్ వరకు, ఫాతిమా జంక్షన్ నుంచి ఎన్ఐటీ వైపు ఉదయం 4 నుంచి 10 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదు.

ప్రజలు సహకరించాలి

హాఫ్ మారథాన్‌ సజావుగా నిర్వహించేందుకు ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను గమనించి, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత కోరారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించి ప్రయాణంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ముందస్తు ప్రణాళికతో బయలుదేరాలని సూచించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *