- ‘సే నో డ్రగ్స్’ నినాదంతో యువతకు అవగాహన
- ఐదో రోజు పోటీల్లో సత్తాచాటిన క్రికెట్ జట్లు
తెలుగు గళం వెంకటాపురం(నూగూర్), అక్టోబర్ 15:
దసరా మహోత్సవాల సందర్భంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కాఫెడ్ మైదానంలో వెంకటాపురం క్రికెట్ అసోసియేషన్ (VCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెంకటాపురం ప్రీమియర్ లీగ్ (VPL) సీజన్–3 క్రికెట్ టోర్నమెంట్ ఐదో రోజు ఉత్సాహంగా కొనసాగింది. ‘సే నో డ్రగ్స్’ నినాదంతో యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచి క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఐదో రోజు జరిగిన తొలి మ్యాచ్లో హేమాచల వారియర్స్, వైకింగ్ వారియర్స్పై విజయం సాధించింది. రెండో మ్యాచ్లో సాయి మెస్ లెవెన్ జట్టు ఎస్ఎస్ వారియర్స్పై 52 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో మ్యాచ్లో దుర్గమ్మ ఏ లెవెన్ జట్టు హేమాచల వారియర్స్పై 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వట్టం నరేందర్, ఉదయ్, నటరాజ్లకు ముఖ్య అతిథి డిప్యూటీ తహసీల్దార్ మహేందర్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందజేశారు.
